ఉదయాన్నే లేవగానే తాగే కాఫీ సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటే ఎంత బాగుంటుంది ..మళ్ళీ ఇంకో కప్పు తాగాలి అనిపిస్తుంది ..కదా మరి అలాంటి కాఫీ కోసం పాలు నీళ్లు కొలతలు ఎలా కరెక్ట్ గా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం..
చాలా మందికి అపోహ ఏంటంటే కాఫీ తీసుకుంటే అందులో కెఫిన్ అనే విష పదార్థం ఉంటుంది కాబట్టి చాలా హానికరం ఆరోగ్యానికి అని కానీ వాస్తవానికి రోజుకి సగటున మనిషి
రెండు నుంచి మూడు కప్పులు వరకు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని ఈ మధ్య అధ్యయనాల్లో కూడా వెల్లడించారు .. ఏదైనా లిమిట్గా తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఉదయాన్నే కాఫీ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ లోని నరాలు యాక్టివ్ అవుతాయి. అలాగే తాజా అధ్యయనంలో వెల్లడించింది ఏంటంటే హార్ట్ కూడా అంటే గుండె కి కూడా చాలా మంచిదని...
రోజుకి రెండు కప్పులు తీసుకోవడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. గర్భిణి స్త్రీలు కాఫీ, టి లు తీసుకోకపోవడమే మంచిది మీరు బాగా అలవాటు పడి ఉంటే ఒక కప్పు కి కుదించుకోండి..
మరి ఇంకా సూపర్ పర్ఫెక్ట్ కాఫీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా దానికి కావలసిన పదార్థాలు....
ఒక గ్లాసు కాఫీకి కొలతలు
పాలు అర కప్పు (హోల్ మిల్క్ లేదా ఫుల్ క్రీమ్ పాలు అయితే)
నీరు అర కప్పు
పంచదార మీకు తగినంత ,
ఇన్స్టంట్ కాఫీ పౌడర్ bru,nescape లేదా మీ ఇష్టం.. 1 చెంచా
పాలు 1 కప్పు. ( Homonised లేదా toned milk అయితే)
పాలు ఫుల్ క్రీమ్ అయితే దాంట్లో కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి పాలు నీళ్లు యాడ్ చేసుకోవాలి.
పాలు toned milk అయితే దానిలో కొవ్వు శాతం అసలు ఉండదు లేదా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి నీరు వాడకుండా పాలతోనే పెట్టుకుంటే కాఫీ చాలా బాగుంటుంది.
తయారు చేసే విధానం ..ముందుగా పాలను గిన్నెలో పోసి వేడిచేసి అలాగే నీళ్లను కూడా కొలతలు వారీగా తీసుకొని పాలపొంగు వచ్చేదాకా ఉంచండి తర్వాత కొంచెం పంచదార తగినంత వేసుకొని కొంచెం మరగనివ్వండి ఈ లోపల ఒక గ్లాసులో తగినంత కాఫీ పౌడర్ తీసుకొని అందులో మరిగిన పాలను పోసి ఒక నాలుగైదు సార్లు అటు ఇటు తిప్పండి కాఫీ సూపర్ గా ఉంటుంది.
ఇలా తయారు చేసే విధానం ఈజీగా మీకు తెలియాలి అంటే కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి .. వీడియో ద్వారా తెలుసుకోండి..మీకు నచ్చితే లైక్ చేయండి ..మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ..అలాగే మా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి.
0 Comments