మనం ఇంట్లో సాధారణంగా పెసర పప్పు టమాట, పాలకూర పెసరపప్పు తింటం కదా అలాగే పెసరపప్పు నిమ్మకాయ ఒకసారి ట్రై
చేయండి చాలా టేస్టీగా ఉంటుంది.
చేయండి చాలా టేస్టీగా ఉంటుంది.
పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అలాగే అనేక ప్రోటీన్స్, పోషక విలువలు కలిగి వుంది. వేసవికాలంలో పెసరపప్పు చారు తింటే చలవ చేస్తుంది కంది పప్పు చారు కన్నా పెసరపప్పు చారు చాలా మంచిది.
కావలసిన పదార్థాలు
పెసర పప్పు ఒక కప్పు , ఉల్లిపాయ మీడియం సైజ్ ఒకటి ,పచ్చిమిర్చి రెండు ,కరివేపాకు తగినంత ,ఉప్పు తగినంత ,నిమ్మకాయ మీడియం సైజ్ ,కారం తగినంత, నూనె తగినంత,
పోపు సామాను: పచ్చిశనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జీలకర్ర ,వెల్లుల్లి రెబ్బలు మూడు ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు .
తయారు చేసే విధానం
ముందుగా పెసరపప్పును ఒక పావు గంట శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి.
ముందుగా పెసరపప్పును ఒక పావు గంట శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి.
పెసరపప్పు నాని లోపు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని లేదా ప్రెజర్ కుక్కర్ లో నానబెట్టిన పెసరపప్పు అలాగే పప్పు కు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు వేసి విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద ఉంచండి.
ఇప్పుడు మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ పోయినాక మూత తీసి బాగా కలపండి పెసరపప్పు బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా పప్పు పప్పు గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది.
ఈ పప్పులో చింతపండు కానీ టమాటాలు కానీ యాడ్ చేయకూడదు అవి వేస్తే టెస్టు మారిపోతుంది.
ఇప్పుడు వేరే బాండీలో నూనె వేసుకొని పోపు పెట్టుకుందాం ..పోపు సామాను వేసి నాక వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై అయినాక ఈ పోపును పెసరపప్పు లో వేయండి.
ఇప్పుడు పెసరపప్పు కింద స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత చక్కగా ఒక గిన్నెలో తీసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి. ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసి రసం తీసి ఆ నిమ్మరసాన్ని పెసరపప్పు లో వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచండి తరువాత ఒకసారి టెస్ట్ చూడండి ఉప్పు కారం నిమ్మరసం సరిపోతుందో లేదో చూసుకోండి.
నిమ్మరసం యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేయాలి గుర్తుంచుకోండి. అంతేనండి చాలా సింపుల్గా పెసరపప్పు నిమ్మకాయ రెడీ అయిపోతుంది వేడి వేడిగా అన్నం లో సైడ్ డిష్ తో అందరికీ సర్వ్ చేయండి చాలా రుచిగా ఉంటుంది.
పైన చెప్పిన విధానం మీరు ఈజీగా క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే కింద లింక్ పై క్లిక్ చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి.
ఈ వంటకం మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ..అలాగే ఫాలో అవ్వండి దానికోసం ఫాలో బటన్ పై క్లిక్ చేయండి ..అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
0 Comments