పిల్లలు అన్ని కూరలు తినడానికి ఇష్టపడరు అలాగే బీన్స్ ఏమాత్రం ఇష్టపడరు అలాగే పెద్దలు కూడా అంతగా ఇష్టపడరు ఎందుకంటే బీన్స్ కర్రీ అంత టేస్టీ గా ఉండదు. కానీ బీన్స్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి ప్రత్యేకంగా పిల్లలకి చాలా మంచిది.
బీన్స్ లో ఉండే అమినో ఆసిడ్స్ మన డైట్ కు చాలా ఉపయోగపడతాయి. అంతే కాదు, మాంసాహారం, గుడ్లు, చేపలు, డైరీప్రోడక్ట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో పూర్తిగా, ఎక్కువగా ఉన్నాయి. బీన్స్ చాలా తక్కువ కాలరీలను కలిగి ఉంది మరియు ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు జీరో. విటమిన్లు, ప్రోటీనలు, మినరల్స్ మరియు మైక్రో న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి.
అందుకని బీన్స్ క్యారెట్ తో కలిపి రెసిపీ తయారుచేసుకొని దాంట్లో కొంచెం ఇంగ్రిడియంట్స్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడతారు.
మీరు ఒక సారి ట్రై చేసి చూడండి చపాతీలోకి అన్నంలోకి జొన్న రొట్టె లోకి చాలా బాగుంటుంది.
మరి క్యారెట్ బీన్స్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా ..దానికి కావలసిన పదార్థాలు
క్యారెట్ 100 గ్రాములు,
బీన్స్ 100 గ్రాములు,
ఉల్లిపాయలు పెద్దది ఒకటి
,పచ్చిమిర్చి 2 ,ఉప్పు తగినంత,
కారం తగినంత ,
పసుపు అర టీ స్పూన్,
శెనగపిండి రెండు స్పూన్లు,
నూనె తగినంత
పోపు సామాను.. పచ్చి శనగపప్పు,
మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర,
ఎండు మిరపకాయ,
కరివేపాకు.
వీడియో ద్వారా చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తయారు చేసే విధానం-
ముందుగా క్యారెట్ ని బీన్స్ శుభ్రంగా ఉప్పు నీళ్లలో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి..
చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి..
తరువాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీ గా పెట్టుకుందాం .
ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నూనె వేసి కొంచెం కాగాక పోపు సామాను వేసుకోవాలి.
పోపు వేగాక అందులో రెండు ఎండుమిరపకాయలు 2 , వెల్లుల్లి రెబ్బలు చిదిమి వేయండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు
కొంచెం కరివేపాకు వేగాక కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి
లైట్ గా వేగనివ్వాలి .ఒక నిమిషం తరువాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను ముందుగా వేసుకొని
ఒక నిమిషం వేగాక చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి.
ఐదు నిమిషాలు వేగాక తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి.
తర్వాత మూత తీసి కూరను అటు ఇటు బాగా కలపండి, కూర ముక్కలను వేగిందో లేదో టెస్ట్ చేయండి కూర బాగా వేగితే కొంచెం కారం వేసి బాగా కలపండి.
బాగా కలిపితే కూర అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు కూర చివరికి వచ్చేసింది కదా..
ఈ సమయంలో కూర కు తగ్గట్టుగా ఒక స్పూను శెనగపిండి వేసి అటు ఇటు బాగా కలపండి ఒక్క నిమిషంలో ఆఫ్ చేసేయండి..
చివరగా కొత్తిమీర ఉంటే వేసుకుని వేడివేడిగా అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ తయారు చేసే విధానం ఇంకా క్లియర్ గా చక్కగా అర్థమవ్వాలంటే ఇచ్చిన వీడియో లింక్ పై క్లిక్ చేయండి.
మీరు మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి .మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వ్యాస కర్తను లేదా బ్లాగర్ ను ఫాలో అవ్వండి మరిన్ని వంటకాల కోసం ధన్యవాదాలు...
0 Comments