కంచి పరమాచార్య లీలలు kanchi parmacharya leelalu miracle story unknown telugu facts

కంచి పరమాచార్య వైభవమ్ 

కంచి పరమాచార్య లీలలు 

ఆధ్యాత్మిక విశేషాలు

నిజ జీవితంలో జరిగిన కథలు

 కొత్త చీర - పాత చీర


ఆరోజు దీపావళి పండుగ వేళ గుర్రబ్బండి తోలేవ్యక్తి శ్రీమఠానికి వచ్చి పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామివారిని ఏదో అడగాలన్నట్టు పక్కన నిలబడ్డాడు.


పరమాచార్య స్వామివారు సైగలతో అతణ్ణి, “నీకు ఏమికావాలి?” అని అడిగారు. కాస్త సంకోచిస్తూ తనకు పంచె కావాలని అడిగాడు.


స్వామివారు శ్రీమఠం సేవకుణ్ణి పిలిచి అతనికి ఒక పంచె, తువ్వాలు ఇవ్వమని ఆదేశించారు. ఆ శిష్యుడు ఒక పంచె, తువ్వాలి తెచ్చి అతనికి ఇచ్చాడు.

 కానీ అతను అక్కడి నుండి కదలక తన భార్య కోసం ఒక చీరను అడిగాడు.


అప్పటికి మఠం చీరలు లేవు, కానీ స్వామివారు ఒక చీరను ఇవ్వమని ఆ శిష్యునికి చెప్పారు. ఇప్పుడు ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు.


మహాస్వామి వారి దర్శనం కోసం ఎందరో భక్తులు వరుసలో నిలబడున్నారు. ఆ వరుసలో నిలబడున్న ఒకామెకు ఆ శిష్యుని పరిస్థితి అర్థమైంది. 

ఆవిడ వెంటనే కొద్దిదూరంలో మరుగున ఉన్న చోటుకువెళ్ళి, తనతోపాటు తెచ్చుకున్న పాత చీరను కట్టుకుంది. అప్పటిదాకా కట్టుకున్న 

కొత్త చీరను మడిచి ఒక రవిక గుడ్డను జతచేసి ఇద్దరూ ఆ గుర్రబ్బండి నడిపే వ్యక్తికి ఇచ్చారు.


కొద్దినిముషాల్లోనే స్వామివారి ఎదుటకు దర్శనంకోసం నిలబడున్న దంపతులోకరు వచ్చారు. తమ కుమార్తె పెళ్లిపత్రికను తీసుకునివచ్చి స్వామివారి ఆశీస్సులను కోరారు.


“పెళ్లిచీరలను కాంచీపురంలోనే కొన్నారా?” అని అడిగారు స్వామివారు.


“అవును, చాలా చీరాలను కొన్నాము - పెళ్లి చీరతో పాటు, ఆడపడుచులకు బంధువులకు కూడా కొన్నాము” అని చెప్పారు.


“మీ చుట్టాలకోసం తీసుకున్న చీరలలో ఒక చీరను మఠానికి ఇవ్వగలరా?” అని అడిగారు స్వామివారు. ఇది వినగానే ఆ దంపతులు ఎంతో సంతోషంతో ఒక ఖరీదైన చీరను తీసి స్వామివారి ముందుంచారు.


మహాస్వామివారు మరొక శిష్యుణ్ణి పిలిచి, “అక్కడ నిలబడున్న ఆవిడకు ఈ చీరను ఇవ్వు. ఆమె తన దీపావళి కొత్త చీరను గుర్రబ్బండి నడిపే వ్యక్తికి ఇచ్చి తను పాత చీరను కట్టుకుంది” అని ఆదేశించారు.


కానీ ఇదంతా స్వామివారి ఎదురుగా జరగకపోయినా ఈ విషయం స్వామివారికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు ఆ శిష్యునికి. ఆమె కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఏ దైవశక్తి ఈ విషయాన్ని స్వామివారి చెవిలో చెప్పిందో మరి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం 

New saree - old saree


That day is Diwali. The Gurrabbandi leather man came to Sri Math and prostrated himself to Paramacharya Swami and stood beside him as if to ask something of Swami.


Paramacharya Swami gestured to him, "What do you want?" asked. Hesitantly, he asked if he wanted panche.


Swami called the sevak of Srimatham and ordered him to give him a panche and a towel. The disciple brought a panche and a towel and gave it to him.

 But he did not move from there and asked for a saree for his wife.


At that time there were no mutt sarees, but Swami asked the disciple to give one saree. He did not know what to do now.


Many devotees are standing in line to have a glimpse of Mahaswami. A woman standing in that row understood the situation of that disciple.

She immediately went to a hidden place at a short distance and tied the old saree she had brought with her. Tied till then

After folding the new saree and adding a bodice cloth, both of them gave it to the horseman.


Within a few minutes, the couple who were standing for darshan came to Swami. They brought their daughter's marriage certificate and sought the blessings of Swami.


"Did you buy the wedding sarees in Kanchipuram?" Swami asked.


“Yes, we bought a lot of sarees – besides the wedding sarees, we also bought them for the girls' relatives,” he said.


“Can you give one of the sarees you took for your wraps to the Math?” Swami asked. On hearing this, the couple was very happy and took out an expensive saree and presented it in front of Swami.


Mahaswami called another disciple and said, “Give this saree to that woman standing there. She gave her Diwali new saree to the horse-drawn carriage driver and tied her old saree.”


But even if all this did not happen in front of Swami, the disciple did not understand how Swami knew about this matter. She was also very surprised. Which divine power spoke this thing in the ears of Swami.


Apara Karunasindhum Gnanadam Shantrupinam

Shri Chandrasekhara Guru Pranamami Mudanvaham


Post a Comment

0 Comments