కంచి పరమాచార్య కథలు లీలలు Sri kanchi parmacharya miracles stories

 శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ 

కంచి పరమాచార్య లీలలు ఆధ్యాత్మిక విశేషాలు

నిజ జీవితంలో జరిగిన కథలు

 దవనం - దొంగ



పరమాచార్యస్వామి వారు ఎక్కడ బసచేసినా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు తరచుగా మహాస్వామి వారిని దర్శిస్తుంటారు. మహాస్వామి వారికి కూడా వారు తెలుసు. ఒక రోజు తరచుగా మహాస్వామి వారిని దర్శించే ఒక ముసలావిడ శ్రీమఠానికి వచ్చింది. 

తన వంతు రాగానే మహాస్వామి వారికి నమస్కారంచేసి వారిని దర్శించుకుంది. పరమాచార్యస్వామి వారు ఆ ముసలావిడని అశీర్వదించి, ఒక పళ్ళెంలో కొన్ని పళ్ళు ఉంచి ప్రసాదంగా తీసుకొమ్మన్నారు. ఆవిడ ఆ పళ్ళెంతీసుకుని పళ్ళుతీసుకుంటూ ఒక చిన్న దవనం తీగని చూసింది. ఆవిడ ఆ దవనాన్ని పక్కకి విసిరివేసి పళ్లను తీసుకోబోయింది.


మహాస్వామి వారు దీన్ని చూసి,”ఎందుకు ఆ దవనాన్ని పారవేసావు? అది నీకు ఉపయోగపడుతుంది తీసుకో” అని అన్నారు.


ఎందుకు మహాస్వామి వారు ఇలా అంటున్నారో అని ఆవిడ ఒక్క నిముషం ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా వెంటనే ఆ దవనాన్ని తీసుకుని జాగ్రత్తగా తన వద్ద దాచుకుంది. 

దర్శనానంతరం ఆవిడ మఠాన్ని వదిలి తన ఊరు చేరుకోవడానికి బస్టాండుకు వెళ్ళింది. తను ఎక్కవలసిన బస్సు దొరకగానే ఎక్కి కూర్చుంది. అలా కూర్చోగానే ఆవిడకు కొద్దిగా నీరసంగా అనిపించి, నిద్రలోకి జారుకుంది.


ఈ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడ మంచిది కాదు. నిద్రపోతున్న ఆ ముసలావిడ సంచీ నుండి పర్సును దొంగిలించింది. కండక్టరు టికెట్టు ఇవ్వడం కోసం వచ్చినప్పుడు ఆ ముసలావిడ నిద్రలేచి డబ్బు ఇవ్వడంకోసం పర్సు వెతకగా అది కనిపించలేదు. పక్కన కూర్చున్న ఆవిడ చేతిలో తన పర్సు చూసి కోపంతో ఆ పర్సు నాది నువ్వు దొంగిలించావు అని గొడవపెట్టుకోసాగింది. కాని ఆవిడ ఆ ముసలావిడ్ని గదమాయిస్తూ ఆ పర్సు తనది అని అందులో ఎంత డబ్బు ఉందో కూడా సరిగ్గా చెప్పింది.


ఇప్పుడు కండక్టరు ఇబ్బందిలో పడ్డాడు. అది ఎవరి పర్సో తేల్చుకోలేకపోతున్నాడు. అకస్మాత్తుగా ముసలావిడకి ఏదో స్ఫురించినట్టు కండక్టరుతో “అందులో డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని అది ఏంటో ఆవిడని చెప్పమని” అడిగింది.


ముసలావిడ చెప్పిన మాటలు విని ఆ పర్సు దొంగిలించినావిడ నోట మాట రాక బేల మొహం వేసింది. అప్పుడు ముసలావిడ కండక్టరుతో అందులో చిన్న దవనం తీగ ఉన్నది అని కావాలంటే చూసుకొమ్మని చెప్పింది. 

కండక్టరు పర్సుతీసి చూడగా అందులో చిన్న దవనం ముక్క కనిపించింది. అప్పుడు ఆ పర్సు దొంగిలించినావిడ తన తప్పును ఒప్పుకుంది. ఆ ముసలావిడ ప్రార్థన మేరకు ఆవిడను క్షమించారు.


పరమాచార్య స్వామి వారు ఆ చిన్న దవనం ముక్కని పారవేయొద్దని ఎందుకు అన్నారో అప్పుడు అర్థం అయింది. మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించుకుని క్షేమంగా తన ఊరు చేరుకుంది.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం .


Sri Kanchi Paramacharya Vaibhavam

Kanchi Paramacharya Leelas are spiritual features

Real life stories

 Davanam - Thief


Wherever Paramacharyaswamy stays, there is a large crowd of devotees. Some devotees often visit Mahaswami. Even Mahaswami knows them. One day an old woman who often visited Mahaswami came to Sri Math.

When her turn came, Mahaswami saluted them and visited them. Paramacharyaswami blessed the old man and asked him to take some teeth in a plate and take it as prasad. She picked the plate and saw a small davanam vine. She threw the davana aside and went to take the teeth.


Mahaswami saw this and said, "Why did you dispose of that davana?" It will be useful for you, take it.


She was surprised for a minute as to why Mahaswami was saying this and without speaking, she immediately took the davana and carefully hid it with her.

After darshan she left the mutt and went to the bus stand to reach her village. She got on the bus when she found it. Sitting like that, she felt a little lethargic and fell asleep.


The woman sitting next to this old lady is not good. The sleeping old woman stole the purse from the bag. When the conductor came to give the ticket, the old woman woke up and looked for the purse to give the money, but it was not found. The woman sitting next to her saw her purse in her hand and got angry and started arguing that you stole the purse from me. But she passed the old man and said correctly that the purse was hers and how much money was in it.


Now the conductor is in trouble. He is not able to decide whose person it is. Suddenly something dawned on the old lady and she asked the conductor "to tell her that there is something else in it besides money".


Hearing the words of the old woman, Bela's face fell when she heard the words of the woman who had stolen the purse. Then the old lady told the conductor to see if there was a small Davanam string in it.

When the conductor opened the pouch, he saw a small piece of Davanam in it. Then the woman who stole the purse confessed her mistake. As per the old lady's prayer, she was forgiven.


Then I understood why Paramacharya Swami said not to throw away that small davanam piece. After bowing to Mahaswami in his mind, he reached his village safely.


Apara Karunasindhum Gnanadam Shantrupinam

Sri Chandrasekhara Guru Pranamami Mudavaham.


Post a Comment

0 Comments