2. రెండవరోజు పారాయణము
రెండవ అధ్యాయము
కార్తీక సోమవార వ్రతము:
వశిష్ట ఉవాచ: ఓ జనక మహారాజా! వినినంత
మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా
చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక
మహత్యాన్ని శ్రద్ధగా విను సుమా! అందున్నా
ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం
వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని,
చేరుకుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ఏ.
సోమవారం రోజయినా సరే స్నాన, జపాదులను
ఆరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని
పొందుతాడు. ఈ సోమవార వ్రతినిధి ఆరు.
రకాలుగా ఉంది. 1, ఉపవాసము, 2. ఏకభుక్తము,
3. నక్తము, 4. అయాచితము, 5. స్నానము, 5.
తిలాదానము.
1. ఉపవాసము: శక్తి ఉన్నవారు:
కార్తీక సోమవారం రోజున పగలు అంతా
భోజనం చేయకుండా (ఉపవాసంతో) గడిపి,
సాయంకాలమున శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనం.
తరువాత తులసీతీర్థం మాత్రమే సేవించాలి.
2. ఏకభుక్తము: సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నాన, దాన, జపాలను యథావిధిగా చేసుకుని -మధ్యాహ్నం భోజనము చేసి, రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్ధమో, తులసితీర్థమో మాత్రమే తీసుకోవాలి.
3. నక్తము: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు.
4. అయాచితము: భోజనం కోసం తమకు తాము ఏమాత్రం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి.
5. స్నానము: పైవాటికి వేటికీ శక్తి లేనివాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినా చాలు.
6. తిలాదానము: మంత్ర జపవిధాలు కూడా తెలియనివాళ్ళు, కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది.
పై 'ఆరు' పద్ధతులలో దేన్నీ ఆచరించినా.
కార్తీక సోమవారవ్రతం చేసినట్లే అవుతుంది.
కానీ,తెలిసి కూడా ఏ ఒక్కదాన్నీ ఆచరించనివాళ్ళు. ఎనిమిది యుగాలపాటు కుంభీపాక గౌరవాని నరకాల్ని పొందుతారని అర్షవాక్యం. ఈ వ్రతమాచరణము వలన అనాథలూ, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యం పొందుతారు.
కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున పగలు ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ
ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు అని ప్రతీతి...
సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు
నమకచమక సహితంగా శివ అభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి.
ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను.
పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి 'ఇష్టం' అనే
కూతురు ఉండేది. పుష్టిగానూ, అందంగానూ,
అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు
గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ
భూయిష్టమైన గయ్యాళిగానూ, కాముకురాలిగానూ
తిరిగే ఈ 'నిష్టల'ని ఆమె గుణాల వల్ల 'కర్కశ' అని
కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి
ఆ కర్మశని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ
అనేవానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు.
ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు,
సదాచారపరుడు, సరసుడూ మాత్రమే కాకుండా
సహృదయం కూడా కావడం వలన కర్మశ
ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ
వచ్చింది. పైగా ఆమె ప్రతి రోజూ తన భర్తను,
తిడుతూ, కొడుతూ, ఉండేది. అయినప్పటికీ,
కూడా మనసుకు వచ్చినది కావడంతో మోజు.
చంపుకోలేక కొంతా, భార్యను వదిలివేయడం.
తన వంశానికి పరువుతక్కువ అనే ఆలోచన
కొంత వలన మిత్రశర్మ, కర్మశ పెట్టే కఠినమైన
హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు గాని,
ఏనాడూ ఆమెను శిక్షంచలేదు. ఆమె ఎందరో
పరపురుషులతో అక్రమసంబంధం పెట్టుకుని
భర్త, అత్తామామలను మరింత నిర్లక్ష్యంగా
చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు
ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ
మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ
కలుసుకోలేక పోతున్నామని రెచ్చగొట్టడంతో
కర్కశ ఆ రాత్రే నిద్రలో వున్న తన భర్త శిరస్సును
ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి,
ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పొడుపడిన నూతిలోకి విసిరి వేసింది.
ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ ఉండడం వలన, అత్తమామలు ఆమెను ఏమీ అనలేకపోయారు, తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్మశ.. కన్నుమిన్ను కానని కామావేశంతో అనేకమంది
పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింప చేసి, తన విటులకు తార్చి దానిద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్మశ జబ్బుపడింది.
ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల వలన పుణ్యమా అని, అనేక రకమైన వ్యాధులు సోకాయి.
పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది.
జగీజగీ తగ్గిన కర్మశ దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి.
ఆమె సంపాదన పడిపోయింది.
చివరికి అక్రమపతులకే కానీ, సుతులకు నోచుకోని ఆ నిష్టం, తినడానికి తిండీ, ఉండడానికి యింత ఇల్లూ, వంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొనవూపిరితో ప్రాణలతో, నడివీధినపడి మరణించింది.
కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది.
యమదూతలు ఆ జీవిని పాశ బద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్లిపోయారు . యముడు ఆమెకు దుర్బరమైన
శిక్షలను విధించాడు.
భర్తద్రోహికి భయంకర నరకం:
భర్తను విస్మరించి పరపురుషులను
ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత
మండుతున్న ఇనుపస్తంభాలను కౌగిలించుకునేలా
చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు
-ముళ్ళగదతో ఆమె తల చిట్లిపోయేలా
-కొట్టించాడు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు,
తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకొని
కఠినమైన శిలలపై వేసి బాధించాడు. సీసం కాచి
చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి
పంపాడు. ఆమె పాపాలకుగాను ఆమె ముందు
సదితరాలవారూ, తరువాత పదితరాలవారూ
కలిపి మొత్తం 21 తరాలవారిని
భీపాకంలో కుమిలిపోసాగారు. నరక
అనుభవం తరువాత ఆమె పదిహేను సార్లు భూమిపై
కుక్కగా జన్మించింది. పదిహేనవ జన్మలో కళింగ
దేశంలో కుక్కగా పుట్టి, ఒక బ్రాహ్మణ గృహంలో
ఉంటూ ఉండేది..
సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం:
ఇలా ఉండగా, ఒక కార్తీక సోమవారం
రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి,
శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి, నక్షత్ర
దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్దపడి,
ఇంటిబయట బలిని విడిచిపెట్టాడు. ఆరోజంతా
ఆహారం దొరకక వున్న కుక్క ప్రదోష రోజున ఆ
బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి
పూర్వస్మృతి కలిగి 'ఓ బ్రాహ్మణా! రక్షించు' అని
కయ్యి కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని
వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి
ఆశ్చర్యపోతూనే 'ఏం తప్పు చేశావు? నిన్ను నేను.
ఎలా రక్షించగలను?' అని అడిగాడు.
అందుకు ఆ కుక్క 'ఓ బ్రాహ్మణుడా||
పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో.
కళ్ళు మూసుకుపోయి, కాముకురాలిని అయి.
చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకూ, వర్ణ
సంకరానికి కారకురాలినైన పతితను. ఆ పాపాలకు
అనుగుణంగా అనేకకాలం నరకంలో చిత్రహింసలు
అనుభవించి, ఈ భూమిపై ఇప్పటికి 14సార్లు
కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది
- ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు
ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్ధం కావడం లేదు.
దయచేసి వివరించు' అని కోరుకుంది.
బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో
తెలుసుకుని 'ఓ శునకమా! ఈ కార్తీక సోమవారం.
"రోజున ప్రదోష సమయం వరకూ పస్తుతో ఉండి
నేను వదిలి పెట్టిన ఐలి తిన్నందువల్ల నీకు ఈ
పూర్వజన్మ జ్ఞానం కలిగింది' అని చెప్పాడు. దాంతో
ఆ కుక్క 'కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా! నాకు
మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు' అని
కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు
తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో,
ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి
ధారపోయగా, వెంటనే ఆ కుక్క తన శునక దేహాన్ని
విడిచిపెట్టి దివ్యస్త్రీ శరీరంలో, ప్రకాశవంతమైన
వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి
చేరుకుంది. కాబట్టి 'ఓ జనకరాజు! నిస్సంశయంగా
శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు
తప్పకుండా ఆచరించు" అని వశిష్ఠుడు చెప్పడం
ఆపాడు..

0 Comments