కార్తీక పురాణం మూడవ అధ్యాయం మూడో రోజు పారాయణం కార్తీక మాస పురాణ కథలు

 

3. మూడవరోజు పారాయణం

బ్రహ్మర్షి అయిన శ్రీవశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పసాగాడు. 'రాజా! స్నాన దాన జప తాపాలలో దేనినిగాని, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా - అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. 

ఎవరైతే సుఖాలకు, శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించకుండా ఉంటారో, అటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.


శ్లో॥ పౌర్ణమ్యాం కార్తికేమాసి స్నానాందీస్తు నాచరన్

కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప ॥


శ్లో॥ క్రమాద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః | అత్యె వోదాహరంతీ మ మితిహాసం పురాతనం ॥


భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు ఛండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను.


తత్త్వనిష్టోపాఖ్యానము:

అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వ నిష్టుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకలశాస్త్ర పారంగతుడు, అసత్యములు పలుకని వాడూ, అన్ని భూతములలో దయగలవాడు, తీర్థాటనా ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరీ తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రిచెట్టుమీద - కారునలుపు కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు - 

గడ్డాలు కలవాళ్ళూ, గుచ్చబడిన ఇనుపతీగల లాగా పైకి నిక్కబొడుచకున తలవెంట్రుకలతో, వికృత ముఖాలతో, కత్తులూ కపాలాలు ధరించి, 

సర్వజీవ భయంకరులుగా ఉన్న 

ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. 


ఆ రాక్షసులు వల్ల భయంతో జనం ఆ మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడా ప్రాణసంచారం ఉండేది కాదు. 

అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్త్వనిష్టుడు అదిరిపడ్డాడు.

 దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని


తత్త్వనిష్ణుని శరణాగతి శ్లో॥త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయన

సమస్త భయవిధ్వంసినే | త్రాహిమాం శరణాగతం ..

వ్యాసం పశ్యామి దేవేశి | త్వద్రోహం జగదీశ్వర ||


అంటే దేవతలకు, లోకాలకూ కూడా యజమానిపోయినవాడా! నారాయణా! అవ్యయా| నన్ను కాపాడు. అన్ని రకాల భయాలనూ అంతము చేసేవాడా! నిన్నే శరణుకోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్పు: దిక్కు తెలియనివాడిని. నన్ను కాపాడు 'రక్షించు!' అని ఎలుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడనుండి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షపత్రయం అతడి వెనుకనే పరుగెత్తసాగింది. 

రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ, -సాత్వికమైన విప్పని తేజస్సు కంట పడటం వలన - తెరిపిలేకుండా అతనిచే స్మరించబడుతున్న హరి నామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే తడవుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని, దండప్రణామాలు.

 ఆచరించి, అతనికి తమ వలన కీడు కలగదని నచ్చ చెప్పి, 

"ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి' అని మళ్ళీ నమస్కరించారు. 

వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్త్వనిష్టుడు మీరు ఎవరు? 

చేయరాని పనులు ఏమి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు.

 మరి ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం. బాధలు తీరిపోయే దారి చెబుతాను' అన్నాడు.


బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు. తన కథని ఇలా వినిపించసాగాడు. 'విప్రోత్తమా! నేను ద్రావిడుడను. 

ద్రావిడ దేశంలో మంధర అనే గ్రామాధికారినైన నేను, కులానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని, నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేకమంది విప్రుల ధనాన్ని హరించాను. 

బంధువులకు కానీ, బ్రాహ్మణులకు కానీ ఏనాడూ పట్టెడు అన్నం అయినా పెట్టి ఎరుగను.. నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతొ సహా ఏడుతరాల వాళ్ళు అధోగతి పాలయిపోయారు.

 మరణం తరువాత ఎన్నో నరకయాతనలను  అనుభవించి, చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిని అయ్యాను. దయతలచి నీ కృపా చిత్తంతో నాకు ముక్తిని ఇచే మార్గం ని చెప్పు' అన్నాడు.


రెండవ రాక్షసుడు ఇలా

విన్నవించుకోసాగాడు. 'ఓ పవిత్రుడా! నేను ఈ వాడినే. ప్రతిరోజు నేను నా తల్లిదండ్రులతో గొడవపడుతూ, వారిని తిడుతూ ఉండేవాడిని...

నేను నా భార్యాపిల్లలతో శుభ్రమైన వేడి వేడి అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది కూడు.. పడేసేవాడిని.

 బ్రాహ్మణ కోటికి ఏరోజు ఒక పూట అయినా భోజనము పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బ్రతికేవాడిని, 

ఆ శరీరం కాలం చేసినాక అంటే చనిపోయిన తరువాత నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. 

ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారి బోధించు' అన్నాడు.


అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు

నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నింటిని నా వేశ్యలకు అందచేసేవాడిని....


బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట:


వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. 'ఓ సదాచార నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. 

కాముకుడినీ, అహంభావిని, కఠినమైనవాడిని విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాడిని. చివర గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభావించుతూ పాపపుణ్య విచక్షణరహితుడిగా ప్రవర్తించేవాడిని.

 నేను చేసిన 

 1.దోషాలు ప్రతిఫలంగా నరకం చవిచూసి, తరువాత ఈ భూమిని నానా విధ హీన యోనుల లోపలా, నానా జన్మలనూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. 

 ఓ సహృదయుడా! నన్ను మన్నించి మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు' అని ప్రార్ధించాడు..


తమ పూర్వ జన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకు అభయం ఇచ్చి 'భయపడకండి నాతొ కలిసి కార్తీక స్నానానికి రండి.


మీ సమస్త దోషాలూ నశించిపోతాయి' అని చెప్పి వారిని తన వెంట బయలు దేరమని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీనదిని చేరుకున్నారు.

అక్కడ తత్త్వనిష్టుడు - బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి, ఆ తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు...


శ్లో॥ అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం | అస్యాం కావేర్యాం - ప్రాతఃస్నాన మహం కరిష్యే ॥


అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి దోషాలు అన్నీ తొలగిపోయి దివ్య మేఘాలూ అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.


 రాజా! అజ్ఞానం వలన కానీ, మోహ ప్రలోభాల వలన కానీ, ఏ కారణం చేతనయినా కాని కార్తీకమాస సూర్యోదయ కాలంలో కావేరి నదిలో స్నానం ఆచరించి, విష్ణువును పూజించిన వాళ్ళకు నిస్సందేహంగా పదివేల ఫలం లేదా ఫలితం కలుగుతుంది.

 

 అందువల్ల ఎదో ఒక చేసిన ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానం తప్పకుండా చేయాలి. 

కావేరిలో సాధ్యం కాకపొతే కనీసం గోదావరిలో అయినా, మరెక్కడ అయినా సరే ప్రాతఃస్నానం మాత్రం చేసి తీరాల్సిందే...

అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానం చేయరో, వాళ్ళు పదిజన్మలు ఛండాలపు యోనులలో పుడతారు... అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా!

 కాబట్టి ఎటువంటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ, పురుషులు కానీ....

కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం. ఆచరించాలి. 

మూడవ అధ్యాయము సమాప్తః


Post a Comment

0 Comments