నాలుగవ రోజు పారాయణం
కార్తీక మాస పురాణ కథలు
జనకుడు ఈ విధంగా అడుగుతున్నాడు...
హే మహర్షి నువ్వు ఇంతవరకు కార్తీక మాత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలి ఏయే దానాలు చేయాలి కూడా తెలియజేయమని అడిగాడు.
అన్ని పాపాలను పోగొట్టేది పుణ్యాలను అగన్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలం లేదా ఫలితం సంకల్పము అనేది హాస్యాస్పదమయిన విషయం...
ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించలేదు అనే అటువంటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు.
అందువల్ల వ్రత ధర్మాలను దాని ఫలితాలను చెబుతాను విను కార్తీకమాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంతమైన ఫలం ఫలితం వస్తుంది.
శివాలయ గోపురం ద్వారా శిఖరాలలో కానీ శివలింగ సన్నిధిలో కానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నేతి కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప, నారింజ నూనెతో కానీ దీప సమర్పణ చేస్తారో అంటే దీపాలు వెలిగిస్తారు వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులుగా అవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురు మధ్య బడాయి కోసం కానీ దీపాన్ని ఇచ్చే వాళ్ళు శివ ప్రీతులు అవుతారు.
ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను.
కార్తీకదీపం ఆరాధన మహిమ పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు కుబేరుడిని మించిన సంపద సమకూర్చుకున్న కుమారులు లేని కారణంగా కృంగిపోయాడు
వంశోద్ధారకుడు కోసం తపస్సును చేశాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపసుకు కారణం అడిగి తెలుసుకుని
ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీకమాసంలో శివ ప్రీతిగా వర్తమాచరించి బ్రాహ్మణులకు దీపదాన దక్షిణతో సంతోష పెట్టు చాలు అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు.
రిషి వాక్యం శిరోధార్యంగా ఆ పంచలు తన పట్టణం చేరి కార్తీక వ్రతం
శివ ప్రీతి కోసం బ్రాహ్మణులకు దీప దానాలు చేశాడు ఫలితంగా మహారాణి నెల తప్పి యుక్తకాలంలో పురుష శిశువును అంటే మగ బిడ్డను ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు కూడా పెట్టారు శత్రుజిత్తు చరిత్ర ...
ఆ శత్రుజిత్తు దినదినంగా ప్రవర్తమానంగా ఎదుగుతూ యువకుడై వీరుడై వేసి సంఘ లోనుడే అప్పటికి తృప్తి చెందకం పరాయి స్త్రీపై కాన్షను పెంచుకుంటూ యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర దిక్కారి అంటే శాస్త్రాన్ని ధిక్కరిస్తూ వర్ణసంకార కారుకుడై మంచి చెప్పడానికి వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తూ
స్వేచ్ఛగా ప్రవర్తించసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాసి సింహం మధ్యమ అరటి దోనెల వంటి తొడలు కలిగినది పెద్దపెద్ద బిరుదులు కుచాలు, కన్నులు కలది అయినా చిలుక వలె పలుకులు కలది అయినా ఒక బ్రాహ్మణ పిల్ల ఎదురుపడింది.
శత్రు ఆమె పట్ల మోహితుడు అయ్యాడు అనుపమాన సౌందర్య శౌర్య తేజ ఈ యువరాజు పట్ల ఆ పిల్ల కూడా మోజు పడింది. దాని కారణంగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాను ఒక సంకేత స్థలంలో రాకుమారుని కలిసి సురత క్రీడలతో సుఖించేది.
ఇలాంటి ర*** పనులు దాగవు కదా ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపన దాని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఆ ర*** జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు కత్తిరించాలని తిరుగుతున్నాడు.
మహాకాముకులైన ఈ జంటకు ఈ సంగతి ఎరుగరు రోజులు ఇలా గడుస్తుండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి కాముకులు తమ సురత క్రీడల కోసం ఒకానొక శిధిల శివాలయాన్ని సంకేత స్థానంగా ఎంచుకున్నారు.
అపరాత్రి వేళ వాళ్లు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది..
తన చీర కొంగు చింపి ఒత్తిని వెలిగించి రాజకుమారుడు ఎక్కడి నుండో ఆముదం తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలో ఆ రెండిటిని జోడించి దీపం పెట్టారు..
ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒక చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు.
ఈ విషయాన్ని ఆ బాపని దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రు అనంతరం తన భార్యను తెగ నరికి తను కూడా పోడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .
ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు అవగానే పాశహస్తులైన యమదూతలు పవిత్రాత్ములైన శివ దూతలు ఒకేసారి అక్కడికి చేరారు.
శివ దూతలు రాకుమారుని రంకులాడిన తమ విమానంలో కైలాసానికి తీసుకొని వెళ్లారు.
యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాక్కుని వెళ్ళసాగారు అందుకు ఆశ్చర్యపడిన బ్రాహ్మణులు శివ దూతలారా కానీ పని చేసిన వారికి కైలాస భోగం కాని పనిచేసిన వారికి కైలాస భాగం నా వంటి సదాచార్యులకి అని ప్రశ్నించగా దానికి శివ దూతలు వేరంతా పాపాత్ములు అయినా ఆరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందులోని శిథిలాలే శిధిలాలయంలో ఉన్న శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములు అయ్యారు.
ఏ కారణం చేతనైనా సరే కార్తీక్ మాసంలో అందునా పౌర్ణమి నాడు పైగా సోమవారం రోజు దేవాలయంలో దీపారపడం చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన ఈ పాప కర్మలని చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకం వీరికి కైలాసం అని చెప్పారు.
బ్రాహ్మణుడికి శివ దూతులకు జరిగిన ఈ సంభాషను విన్న శత్రువు తాను కలుగజేసుకొని అయ్యలారా
దోషుల మేమై ఉండగా మాకు పైలాకు మించి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన అమాయకుడిని నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీకమాసం
అందునా పూర్ణిమ గొప్పది అయితే సోమవారం మరి ఘనమైనది అయితే మాతో బాటే కలిసి మరణించిన బ్రాహ్మణులు కూడా కైలాసం ఇవ్వడం
కైలాసం ఇవ్వడం తప్పదు అని వాదించడం జరిగింది. దాని ఫలితంగా శత్రు జుట్టు తాను తను ప్రియురాలు ఆచరించిన వత్తి తైలం పుణ్యం తాము ఉంచుకొని ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని
బ్రాహ్మణుడికి ధారపోయెగా శివదూతలు బ్రాహ్మణులను కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకువెళ్లారు..
కాబట్టి ఓ మిదులా నగరాదీశ్వర కార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయానికి కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి నెలపొడుగునా చేసిన వాళ్లు జ్ఞానులైత ద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు
అందునా శివాలయంలో చేసిన దీపారాధన నిరంతరం మోక్షప్రదాయంగా గుర్తించు నా మాట విని కార్తీకమాసం నెల అంతా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పాడు..
నాలుగో అధ్యాయం సమాప్తం

0 Comments