కార్తీక మాస పురాణ కథలు ఐదవ అధ్యాయం 5వ రోజు పారాయణం కార్తీక మాసం విశిష్టత

  •  కార్తీక మాస పురాణ కథలు 
  • నాలుగో అధ్యాయం 5వ రోజు పారాయణం 
  • ఓ శివ ధనస్సు సంపన్నుడా !! 
  • జనక రాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింప చేయగల శక్తి ఒక్క కార్తీక్ మాస వ్రతానికి మాత్రమే ఉంది.
  •  కార్తీకమాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుసుభం లాగా తొలగిపోతాయి. 
  • అందుకే 10- 11 అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠనికి క్షేత్రపాలకుడు అవుతాడు .
  • ఎవరైతే కార్తీకమాసంలో తులసీదళాలతో కానీ తెలుపు లేదా నలుపు రంగు గల గన్నేరు పూలతో గాని విష్ణు పూజ చేస్తారో వాళ్ళు విష్ణు సమభోగాలను అనుభవిస్తాడు.
  •  ఈ కార్తీకమాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణ పురాణాన్ని అయినా సరే చదివేవాడు సర్వకర్మ బంధు విముక్తులు అవుతారు.
  •  కార్తీకమాస వనభోజనం కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణు ధామాన్ని పొందుతారు .
  • జప హోమా పూజ భోజనా తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలది అసౌచవంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది...
  •  కాబట్టి మహారాజా కార్తీక శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. 
  • ఆ ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి గంధం పుష్పాలు అక్షతలుతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి.
  •  ఇలా కార్తీకమాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వపాపాల నుంచి విముక్తులు అయ్యి విష్ణు లోకాన్ని పొందుతారు.
  •  ఓ జనపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోని సంకటన నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను.
  • దేవ దత్తోపాఖ్యానం పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే  మంచి బుద్ధి గల బ్రాహ్మణుడు ఉండేవాడు.
  •  అతనికి పరమ దుర్మార్గుడు అయిన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు .
  • అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుడిని చేయాలని సంకల్పం చేసుకొని నాయనా రోజు కార్తీక ప్రాంత స్నానాన్ని ఆచరించు.
  •  సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీకవ్రతాన్ని ఆచరించి ధన్యుడు అని చెప్పాడు ,
  • కానీ ఆ బ్రాహ్మణ పుత్రుడు అటువంటి కట్టు కథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు.
  •  అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుని అడవిలోని చెట్టు తొర్రలు ఎలుకువై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరునోపాయం చెప్పమని కోరగా
  •  ఆ తండ్రి నాయనా నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం తొలగిపోతుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు.
  •  దేవదతుడి శాప విముక్తి తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు దట్టమైన అరణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధార భూతమైనది అయిన ఒక మహా వృక్షం త్వరలో నివసిస్తూ ఉండేవాడు .
  • ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకానొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు కూర్చొని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు.
  • ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్ట పోసుకొనేవాడు.
  •  అయినా కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడు జరగదు.
  •  అదేవిధంగా విశ్వామిత్రుడు వంటి తపోదనులు దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తాపంతోనూ జ్ఞాని అయిన కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలు ఏమిటి అవి వింటూ ఉంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది,
  •  దయచేసి రహస్యం ఏమిటో చెప్పండి అని అనగానే అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు నాయన మేం కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము.
  •  ఈ కార్తీకమాసంలో ఎవరైనా సరే తెలుసు గాని తెలియక గాని స్నానా జపాతప పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుండి విముక్తులు అవుతారు.
  •  ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలిపాడు ఈ విధంగా కిరాతకుడికి చెబుతున్న ఆర్థిక మహత్యాన్ని విన్న వెంటనే త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్తు రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణ 
  • యువకుడి రూపాన్ని పొంది విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి తన పూర్వ కథను వినిపించి ఆ రుషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు ,
  • తర్వాత ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు శిష్య బృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడు
  •  అయి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జనక మహారాజా ఉత్తమ గతులను కోరుకునే వారు ప్రయత్న పూర్వకంగా
  •  అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీస కార్తీక మాస మహత్యం అయిన శ్రద్ధతో వినాలి. 
  • ఐదవ అధ్యాయం సమాప్తః
  •  ఓం నమః శివాయ

Post a Comment

0 Comments