కంచి పరమాచార్య కథలు లీలలు kanchi parmacharya leelalu unknown telugu facts

 కంచి పరమాచార్య లీలలు

శ్రీ కంచి పరమాచార్య నిజ జీవితంలో జరిగిన కథలు


మహాస్వామి వారి అన్నపూర్ణావతారం మహా అద్భుతం

పరమాచార్య స్వామివారు ఒక తమిళ సామెతను ఎప్పుడూ చెప్పేవారు, “అందరికీ అన్నం పెట్టు, భేదం చూపకుండా” అని. ఆహారం పెట్టేటప్పుడు ఎవరు, ఏమిటి అన్న ఎటువంటి బేధం చూపరాదని చెప్పేవారు.


 రాత్రిపూట దొంగలకు కూడా ఆహారం అందించే ఒక కేరళ సంప్రదాయం గూర్చి ఎప్పుడూ తెలిపెవారు స్వామివారు. కేరళలోని చేరుక్కుణ్ణం అన్న ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ దేవాలయంలో ఈ పధ్ధతి ఉంది. దేవాలయంలోని భక్తులందరి భోజనాలు అయ్యాక, ఆహార పొట్లాలు కట్టి, 

 వాటిని చెట్టుకు వేలాడదీసేవారు అటుగా వెళ్ళే దొంగలకోసమని.


సంగం సాహిత్యంలో ఉధియన్ చేరాళదన్ అన్న చేర రాజు మహాభారత యుద్ధ సమయంలో పాండవ కౌరవ ఇరు పక్షాల వారికీ అన్నం పెట్టి ‘పేరుం సోట్రు చేరాళదన్’ అన్న పేరు ఎలా పొందాడో తెలిపేవారు స్వామి.


వేటగాడైన కన్నప్ప శివునికి ఆహారం పెట్టాడు. వేటగాడైన గుహుడు శ్రీరామునికి ఆహారం పెట్టాడు. ఇక్కడ, శ్రీశైలం అడవులలో ఉండే చెంచులు పరమాచార్య స్వామివారిచే ఆహారం పొందారు.


రవాణా వ్యవస్థ అంతగా లేని 1934లో పరమాచార్య స్వామివారు మందీమార్బలంతో కీకారణ్యంలో ఉన్న శ్రీశైలం వెళ్తున్నారు. దారిలో ఒకచోట వారికి చెంచులు ఎదురయ్యారు. 

ఆ చెంచులు మొదట వీరిని శతృవులుగా భావించి బాణాలు చేతబూని విల్లు ఎక్కుపెట్టారు.

 కాని స్వామివారి దివ్య తేజస్సు చూసి, తప్పు తెలుసుకుని వీరిని ఆదరించారు.


వీరిని అడ్డగించాలని వచ్చినవారే వీరికి కాపలావాళ్లై, సామాను మోస్తూ, రాత్రిపూట పహారా కాస్తూ పరమాచార్య స్వామివారిని సపరివారంగా తదుపరి చోటుకు చేర్చారు. సెలవు తెసుకునే ముందు అందరూ ఒకచోట చేరారు.


మహాస్వామి వారి వారికి కొంచం ధనం ఇవ్వమని మేనేజరును ఆదేశించగా వారు దాన్ని తాకడానికి కూడా ఇష్టపడలేదు. 

ఆ చెంచుల నాయకుడు మేనేజరుకు ఎదో చెబితే, వారు దాన్ని నిరాకరిస్తూ తల అడ్డంగా తిప్పి కుదరదన్నారు.

మహాస్వామివారు చిటికె వేసి మేనేజరును పిలిచి, “అతను ఏమి అడిగాడు, నువ్వు ఎందుకు లేదన్నావు?” అని అడిగారు.


“పెరియవా ముందర వారు నృత్యం చేయాలనుకుంటున్నారు”


“నృత్యం చూడడం వల్ల శ్రీమఠం గౌరవం తగ్గుతుందని మేనేజరుగా నీ అభిప్రాయం కనుక నేను వారి నృత్యం చూడనని నువ్వు అన్నావు”

మహాస్వామి వారి మాటల్లో ఎక్కడా కోపం కనబడలేదు. మేనేజరు మౌనంగా నిలబడ్డారు.


ఎంతో గొప్ప కళాకారుల నృత్యాలు కూడా చూడని మహాస్వామివారు వారి నృత్యాన్ని చూడడానికి అంగీకరించారు ఒక షరతు పైన

మగవారు ఎవరైనా నృత్యం చెయ్యవచ్చు. కాని వారితో పెద్దవారు కాని బాలికలు మాత్రమే కలిసి నృత్యం చెయ్యాలి.


“సందర్భాన్ని బట్టి మీకు వివిధ నృత్యాలు ఉన్నాయి కదా; దేవుని కోసం, గెలిచినప్పుడు, ఆటలకోసం అలా. మరుప్పుడు మీరు చెయ్యదలచుకున్న నృత్యం ఎలాంటిది” అని అడిగారు మహాస్వామివారు.

“మేము ఇప్పుడు చెయ్యబోయే నృత్యం కేవలం మాకు అత్యంత దగ్గరైన ఆప్తులకు మాత్రమే” అని తెలిపారు.


పరమాచార్య స్వామి వారి నృత్యాన్ని చూసి, వారినందరినీ ఆశీర్వదించి, వారికి మంచి విందు ఏర్పాటు చేశారు.


Kanchi Paramacharya Lilalu kathalu

Real life stories of Sri Kanchi Paramacharya


Annapurnavatara of Mahaswami


Paramacharya Swami used to say a Tamil proverb, "Give rice to all without discrimination". They used to say that no distinction should be made between who and what while serving food.


 Swamy always told about a Kerala tradition of offering food even to thieves at night. Annapurna temple in Cherukkunnam Anna region of Kerala has this practice. After the meals of all the devotees in the temple, food parcels are tied,

 Those who hang them on trees for thieves who pass by.


In the Sangam literature, Swami narrates how Udhiyan Cheraladan Anna Chera King during the Mahabharata war, the Pandava Kauravas gave rice to both sides and got the name 'Perum Sotru Cheraladan'.


Kannappa, the hunter, gave food to Lord Shiva. The hunter Guhu gave food to Lord Rama. Here, the spoonbills in Srisailam forests were fed by Paramacharya Swami.


In 1934, when there was no transport system, Paramacharya Swami was going to Srisailam in Keekaranyam with Mandimarbalam. Somewhere along the way they encountered spoons.

At first, the Chenchus considered them as enemies and put arrows and bows on them.

 But seeing Swami's divine brilliance, he realized his mistake and supported them.


Those who came to intercept them were their guards, carried the luggage and fed them at night, escorting Paramacharya Swami to the next place. Everyone gathered together before taking leave.


Mahaswamy ordered the manager to give them some money but they did not even want to touch it.

If the leader of the spoons tells the manager something, they can't turn their heads and deny it.

Mahaswamy pinched and called the manager, "What did he ask, why are you not there?" asked.


“Periyava Mundara wants to dance”


"You said that I will not watch their dance because you as a manager think that watching the dance will reduce the respect of Sri Math"

There was no anger in Mahaswami's words. The manager stood silent.


Mahaswamy, who had never seen the dances of many great artists, agreed to watch their dance on one condition

Any male can dance. But only non-adult girls should dance with them.


“Don't you have different dances depending on the occasion; For God, when winning, for games like that. What kind of dance do you want to do next time?” asked Mahaswami.


"The dance we are going to do now is only for our closest loved ones," he said.


Paramacharya Swami saw their dance and blessed them all and arranged a good feast for them.

Post a Comment

0 Comments