**** కార్తీక మాస పురాణ కథలు ***
ఏడవ రోజు పారాయణం ఏడవ అధ్యాయం
ఓ జనక మహారాజా..
కల్మషులైన కార్తీకమాసంలో పుష్పార్చన దీప విధి విధానాలు చెబుతాను విను ..
పుష్పార్చన ఫలదానా దీపవిధి విశేషములు నాధుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వల్ల కమలంలో కూర్చుని లక్ష్మీదేవి ఆ భక్తులు ఇళ్లల్లో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది .
తులసి దడలతో తులసి దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ మారేడు దళలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు.
ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారు వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి.
ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయతో పూజించే వారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు.
కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ కళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులు ఎవరు ఉండరు అనడం అతిశయోక్తి కాదు.
బ్రాహ్మణ సహితులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహా పాపాలు సైతం మట్టి కలిసిపోతాయి .
బ్రాహ్మణ సహితులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసే వాళ్ళు వైకుంఠాన్ని పొంది విష్ణువుల ఆనందిస్తారు.
ఎవరైతే కార్తీకమాసంలో విష్ణు ఆలయంలో మావిడాకుల తోరణం కడతారు వాళ్ళు పరమపదాన్ని పొందుతారు.
పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామిత్యాన్ని పొందుతారు.
ఒక్కసారైనా శ్రీహరిని సాష్టాంగ దండ ప్రమాణం చేసిన వారు అశ్వమేధ పుణ్యం లబ్ది పొందిన వారవుతారు. పిత్రులతో సహా వైకుంఠానికి వెళ్లి సుఖిస్తారు.
స్నానం చేసి తడి బట్టతో ఉన్నవాడికి వస్త్ర దానం చేసిన వాడు పదివేల అస్స మేధాలు ఫలాన్ని పొందుతాడు.
ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్ప పరాగం వలె ఎగిరిపోతాయి.
నల్లనీ లేదా తెల్లని అవిస పూలతో హరి పూజ చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది.
కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో అంటే ఆవు పేడతో అలికి పంచరంగులతో శంకు పద్మ స్వస్తిక్ వంటి రంగవల్లు నువ్వే రంగవల్లులు వేస్తుందో ఆమె విష్ణు కి ప్రియురాలు అవుతుంది.
విష్ణు సన్నిధిలో నంద దీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల ఆదిశేషుడైన పొగడ లేడు.
ఈ కార్తీకమాసంలో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడై అంత్యానా మోక్షాని పొందుతాడు.
విష్ణు ఆలయ మండపాన్ని అలంకరించిన వాడు హరి మందిరంలో చిరస్థాయిగా ఉంటాడు.
హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి.
తులసి గంధంతో సాలగ్రామ పూజ చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు విష్ణు సన్నిధిలో నాట్యం చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలు అన్ని నాశనమైపోతాయి.
భక్తితో అన్నదానం చేసే వాడి పాపాలు గాలికి మంచు తనకలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం మహానది స్థానం బ్రహ్మ పత్ర భోజనం అన్నదానం ఈ నాలుగు ఆచరించడం ధర్మంగా చెప్పబడుతుంది.
స్నానా దానాలు ఆచరించని ఆచరించని వాడు పిసినారి అయి యధా శక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి చివరికి చెండాల యోనిలో జన్మిస్తాడు.
కార్తీక శూన్యలు మరుజన్మలో గాడిదగా పుట్టి తరువాత 100 పుట్టుకలు సునక యోనిలో జన్మిస్తారు.
కార్తీకమాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్య మండలాన్ని చేదించుకుని స్వర్గానికి వెళతాడు పద్మాలతో పూజించినవాడు చిరకాలం సూర్య మండలంలోని నివసిస్తాడు.
ఓ జనక మహారాజా కార్తీకమాసంలో ఎవరైతే అవిశ పూలతో మాలను ధరించి తరువాత పువ్వుల మాలికతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు మాల్యాలతో తులసీదళాలతో విష్ణువను పూజించే వాళ్లు వైకుంఠాన్ని పొందుతారు.
ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను ఆసక్తులైన వాళ్ళు అంటే ఇవన్నీ చేయలేని వారు..
కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్ల పాఠ్యము నాడు కానీ పౌర్ణమి నాడు కానీ లేదా అమావస్యనాడు కానీ సంకల్ప సహితంగా ప్రాంత స్నానం ఆచరించి ఆచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.
ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహా పురాణాన్ని చదివిన విన్న కూడా స్నాన ఫలాన్ని పొందుతారు..
ఇది కేవలం కేవలం అసక్తులకే సుమా కార్తీక్ మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వాడి పాపాలు నశించిపోతాయి .
కార్తీక్ మాసంలో విష్ణు పూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు.
తాము స్వయంగా సంకల్ప పూర్వకంగా విష్ణువును పూజించేవాళ్లు అవ్యాయ పదాన్ని పొందుతారు. కార్తీకమాసం సాయంకాలలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి తర్వాత ద్రవలోకాన్ని పొందుతారు.
ఇలా ఈ కార్తీకమాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వారు ఏడు జన్మలపాటు నక్కగా పుడతారు అనడంలో ఏమి సందేహమే లేదు ....
***** ఏడవ అధ్యాయం సమాప్తః
ఏడవ రోజు పారాయణం సమాప్తహ ******
0 Comments